మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narada Kruta Ganapati Stotram – శ్రీ గణపతి స్తోత్రం (నారద కృతం)
నారద ఉవాచ |
భో గణేశ సురశ్రేష్ఠ లంబోదర పరాత్పర |
హేరంబ మంగళారంభ గజవక్త్ర త్రిలోచన || 1 ||
ముక్తిద శుభద శ్రీద శ్రీధరస్మరణే రత |
పరమానంద పరమ పార్వతీనందన స్వయమ్ || 2 ||
సర్వత్ర పూజ్య సర్వేశ జగత్పూజ్య మహామతే |
జగద్గురో జగన్నాథ జగదీశ నమోఽస్తు తే || 3 ||
యత్పూజా సర్వపురతో యః స్తుతః సర్వయోగిభిః |
యః పూజితః సురేంద్రైశ్చ మునీంద్రైస్తం నమామ్యహమ్ || 4 ||
పరమారాధనేనైవ కృష్ణస్య పరమాత్మనః |
పుణ్యకేన వ్రతేనైవ యం ప్రాప పార్వతీ సతీ || 5 ||
తం నమామి సురశ్రేష్ఠం సర్వశ్రేష్ఠం గరీష్ఠక |
జ్ఞానిశ్రేష్ఠం వరిష్ఠం చ తం నమామి గణేశ్వరమ్ || 6 ||
ఇత్యేవముక్త్వా దేవర్షిస్తత్రైవాంతర్దధే విభుః |
నారదః ప్రయయౌ శీఘ్రమీశ్వరాభ్యంతరం ముదా || 7 ||
ఇదం లంబోదరస్తోత్రం నారదేన కృతం పురా |
పూజాకాలే పఠేన్నిత్యం జయం తస్య పదే పదే || 8 ||
సంకల్పితం పఠేద్యో హి వర్షమేకం సుసంయతః |
విశిష్టపుత్రం లభతే పరం కృష్ణపరాయణమ్ || 9 ||
యశస్వినం చ విద్వాంసం ధనినం చిరజీవినమ్ |
విఘ్ననాశో భవేత్తస్య మహైశ్వర్యం యశోఽమలమ్ |
ఇహైవ చ సుఖం భక్త్యా అంతే యాతి హరేః పదమ్ || 10 ||
ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే ప్రథమైకరాత్రే గణపతిస్తోత్రం నామ సప్తమోఽధ్యాయః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.